'బీసీ ఫెడరేషన్లకు నిధులు విడుదల చేయాలి'
MNCL: రాష్ట్రంలో బీసీ ఫెడరేషన్లకు ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఇవాళ మంచిర్యాలలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటి వరకు నిధులు మంజూరు చేయకుండా బీసీలను మోసం చేయడం సరికాదన్నారు. బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే నిధులు విడుదల చేయాలని తెలిపారు.