నేడు పిఠాపురంలో పర్యటించనున్న ఎమ్మెల్సీ నాగబాబు

KKD: పిఠాపురం నియోజవర్గంలో జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు శనివారం పర్యటిస్తారు. ఇప్పటికే కుమారపురం గోకుల్ గ్రాండ్ హోటల్‌కు నాగబాబు చేరుకున్నారు. నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ నాగబాబు పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఉదయం 10 గంటలకు పాల్గొంటారని పేర్కొన్నాయి.