పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరిన జనాలు
KMR: పెట్రోల్ బంకుల్లో సరిపడా స్టాక్ ఉన్నప్పటికీ ప్రజలు అపోహలతో బంకుల వద్ద బారులు తీరుతున్నారు. ఇప్పటికే జిల్లా అధికారులు, ఎస్పీ పత్రికా ప్రకటన ద్వారా ఇంధన కొరత లేదని స్పష్టం చేసినప్పటికీ ప్రజలు ఆందోళనతో కొనుగోళ్లకు పరుగులు పెడుతున్నారు. వదంతులను నమ్మకుండా ప్రశాంతంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ తెల్లవారకుముందే బంక్‌లకు క్యూ కట్టారు.