VIDEO: శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ
AKP: నర్సీపట్నం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం శనివారం తెల్లవారుజాము నుంచి భక్తుల రద్దీతో కిటకిటలాడింది. ఏకాదశి శుభదినము రావడంతో మహిళా భక్తులు తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక దీపారాధన కార్యక్రమం చేపట్టారు. ఆలయ ప్రధాన అర్చకులు శరత్ కుమార్ ఆచార్యులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.