25న మండల సర్వసభ్య సమావేశం

ప్రకాశం: ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు అధ్యక్షతన తాళ్లూరు మండల సర్వసభ్య సమావేశాన్ని మంగళవారం నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ దారా హనుమంతరావు తెలిపారు. మండలంలోని అన్ని శాఖల అధికారులు తమ శాఖల పురోగతి నివేదికను సిద్ధం చేసుకొని, సర్వసభ్య సమావేశానికి తమవెంట తీసుకొని రావాలని కోరారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొననున్నట్లు తెలిపారు.