వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం

వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం

కడప పట్టణంలోని మహావీర్ సర్కిల్ వద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం స్వామివారికి సుప్రభాత సేవతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోప్తంగా నిర్వహించారు. ఈ కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గోవింద నామ స్మరణతో ఆ ప్రాంతమంతా మారుమోగింది.