పరిసరాలను శుభ్రం చేసిన కలెక్టర్

పరిసరాలను శుభ్రం చేసిన కలెక్టర్

కృష్ణా: మచిలీపట్నంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో పరిశుభ్రత కార్యక్రమంలో కలెక్టర్ బాలాజీ శనివారం పాల్గొన్నారు. వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులతో కలిసి పరిసరాలను శుభ్రపరిచే కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించి, స్వయంగా పరిశుభ్రతలో పాల్గొని ఆధర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.