నేర సమీక్ష నిర్వహించిన ఎస్పీ

నేర సమీక్ష నిర్వహించిన ఎస్పీ

MLG: ములుగు పట్టణ కేంద్రంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ డా. శబరిష్ ఈరోజు నెలవారి నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ నెలలో నమోదైన కేసుల వివరాలపై పోలీస్ స్టేషన్‌ల వారీగా ఆరా తీశారు. అనంతరం పాత కేసుల దర్యాప్తులో పురోగతిని పరిశీలించి, త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయాలన్నారు. బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.