VIDEO: సోమందేపల్లిలో చిరుత సంచారం
సత్యసాయి: సోమందేపల్లి మండలం మరువకుంటపల్లి గ్రామ సమీపంలో బుధవారం సాయంత్రం చిరుత సంచారం చేసింది. అటుగా కార్‌లో వెళ్తున్న కొందరు గ్రామ సమీపంలో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు వీడియో తీశారు. భయపడకుండా ఈ చిరుత అలానే నిలబడి ఉండడంతో కార్‌లో ఉన్నవారు భయంతో అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఫారెస్ట్ అధికారులు వెంటనే చిరుతను పట్టుకోవాలని కోరుతున్నారు.