అయ్యప్ప మాలధారణలో గౌడన్న ఆత్మహత్య
WGL: పురుగుల మందు తాగి అయ్యప్ప స్వామి మాలధారుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన హసన్ పర్తి మండలం దేవన్నపేటలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జనగాని నాగరాజు వ్యవసాయ భూమిని కౌలు చేస్తూ గీత కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అయితే వచ్చిన డబ్బులు సరిపోక, చిట్టి డబ్బులు చెల్లించలేక తీవ్ర మనస్ధాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.