VIDEO: డీజేలపై నిషేధం: రూరల్ సీఐ

VZM: రేపటి నుంచి గణేష్ ఉత్సవాలు ప్రారంభమవుతున్న సందర్బంగా ఉత్సవ కమిటీ సభ్యులకు బొబ్బిలి రూరల్ సీఐ నారాయణరావు మంగళవారం కీలక సూచనలు చేశారు. మండపాలు ఏర్పాటుకు తప్పనిసరిగా అనుమతులు పొందాలన్నారు. డీజేల వలన గుండె పోటు వచ్చే అవకాశం ఉన్నందున నిషేధం విధించామన్నారు. 10 గంటల లోపు మైక్ సెట్లు ఆఫ్ చేయాలని ఆయన సూచించారు.