శ్రీవారి ఆలయంలో కొట్టుకున్న భక్తులు

AP: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు ఒకరినొకరు కొట్టుకున్నారు. క్యూ లైన్ ద్వారా శ్రీవారి ప్రధాన ద్వారం దగ్గరకి వచ్చిన భక్తులు లోపలికి వెళ్లే క్రమంలో ఒకరినొకరు నెట్టుకున్నారు. దీంతో కొంతమంది భక్తులు వాగ్వాదానికి దిగగా.. ఆలయ సిబ్బంది ఎంత చెప్పినా వినకుండా తోసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. భక్తుల చర్యపై పలువురు మండిపడుతున్నారు.