తై బజార్ వేలం వాయిదా..!
NZB: భీమ్గల్ మున్సిపాలిటీలో 2026-27 సంవత్సరానికి సంబంధించిన తై బజార్ వేలం వాయిదా పడినట్లు కమిషనర్ గోపు గంగాధర్ తెలిపారు. మంగళవారం జరగాల్సిన వేలానికి పాటదారులు రాకపోవడంతో ఈ నెల 26న ఉదయం 11 గంటలకు నిర్వహిస్తామన్నారు. వేలంలో పాల్గొనే వారు మున్సిపల్ కమిషనర్ పేరుతో రూ.5 లక్షల డీడీ సమర్పించాలన్నారు. మరిన్ని వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలన్నారు.