'మెగా 157' టైటిల్ గ్లింప్స్‌కు టైం ఫిక్స్

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతోంది. 'మెగా 157' అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమా నుంచి మేకర్స్ అప్‌డేట్ ఇచ్చారు. చిరు బర్త్ డే కానుకగా.. రేపు ఉదయం 11: 25 గంటలకు ఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ సినిమాలో చిరు సరసన నయనతార నటిస్తోంది.