అనుచిత పోస్టు పెట్టిన వ్యక్తిపై ఫిర్యాదు
KMM: సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వ్యక్తిపై బీజేపీ జిల్లా నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఖమ్మం 55, 56వ డివిజన్‌కు చెందిన మౌలాలి అనే వ్యక్తి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోటోపై రిప్ అని రాసి స్టేటస్ పెట్టాడు. దీంతో బీజేపీ టూటౌన్ మండల అధ్యక్షులు ధనియాకుల వెంకటనారాయణ ఆధ్వర్యంలో సోమవారం టూటౌన్‌లో ఫిర్యాదు చేశారు.