లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంచి నీటి ఏర్పాటు

NLG: దేవరకొండలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న పోస్ట్ ఆఫీస్, గాంధీనగర్ పోస్ట్ ఆఫీస్ కార్యాలయాల వద్ద వివిధ రకాల ఆసరా పింఛన్లు పొందుతున్న వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు దాహార్తిని తీర్చడం కోసం తాగు నీరు ఏర్పాటు చేసినట్లు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ వస్కుల సత్యనారాయణ మంగళవారం తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.