ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనుల ఆలస్యంపై పోస్టులు
MDCL: ఉప్పల్ నుంచి నారపల్లి మార్గంలో నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణపు పనులు దాదాపు 7 ఏళ్లు గడుస్తున్నప్పటికీ పూర్తి కాకపోవడంపై సోషల్ మీడియాలో ప్రజలు పోస్టులు చేస్తున్నారు. 2100 అయినా.. ఈ ప్రాజెక్టు పూర్తయ్యేలా కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. రోడ్లు సరిగా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ప్రజలు వాపోతున్నారు.