బయ్యవారికండ్రిగలో అగ్ని ప్రమాదం
TPT: చిట్టమూరు మండలం బయ్య వారికండ్రిగ గ్రామానికి చెందిన అద్దూరు బాబులయ్య గడ్డివాము శుక్రవారం మధ్యాహ్నం దగ్ధమైంది. ఈ ఘటనలో రూ.10 వేల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు వాపోయాడు. ఒకసారిగా దట్టమైన పొగ, మంటలు వ్యాపించడంతో స్థానికులు కోట అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు.