ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
NZB: నందిపేట్ మండలం ఆంధ్రనగర్లో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి, పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఎన్టీఆర్ ఆశయాలు, చంద్రబాబు నాయకత్వంలోని అభివృద్ధిని గుర్తుచేస్తూ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని నేతలు పిలుపునిచ్చారు.