వర్షాకాల శుభ్రతపై విద్యార్ధులతో అవగాహన ర్యాలీ

ASR: వర్షాకాలంలో కాచి చల్లార్చిన నీటిని మాత్రమే త్రాగాలని అనంతగిరి మండల ప్రత్యేక అధికారి డా. స్వామినాయుడు సూచించారు. శనివారం మండలంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర - స్వచ్చాంధ్రలో అయన మాట్లాడారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా, దోమలు లేకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచాలని MPDO ప్రభాకరరావు అన్నారు. విద్యార్ధులతో వర్షాకాల శుభ్రతపై అవగాహన్ ర్యాలి చేపట్టారు.