ఆక్రమంగా గోవులు తరలిస్తున్న వ్యక్తులు అరెస్టు

CTR: అక్రమంగా గోవులు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు కల్లూరు పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ఆనందుడు తెలిపారు. కల్లూరు-సదుం రోడ్డులో వాహనాలు తనిఖీ చేస్తుండగా బొలెరో వాహనంలో 3 ఆవులు, ఓ ఎద్దు, ఓ దూడను పట్టుకున్నామని చెప్పారు. నిందితులు రమేశ్, అన్వర్ బాషాను విచారించగా కసాయి వారికి వీటిని విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నారన్నారు.