మహిళల ఫిర్యాదులకు ప్రత్యేక వెబ్‌సైట్: శైలజ

మహిళల ఫిర్యాదులకు ప్రత్యేక వెబ్‌సైట్: శైలజ

AP: మహిళల ఫిర్యాదుల కోసం రెండు, మూడు వారాల్లో ప్రత్యేక వెబ్‌సైట్ ప్రారంభిస్తామని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ వెల్లడించారు. ప్రస్తుతం మహిళా కమిషన్ ఫోన్ నంబర్, వాట్సాప్, మెయిల్స్ ద్వారా బాధిత మహిళల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులకు గురవుతున్న మహిళలకు ఫిర్యాదు కోసం క్యూర్ కోడ్ అందుబాటులోకి తీసుకువచ్చాన్నారు.