బ్యానర్ల వివాదం.. ఫ్లెక్సీ షాప్ యజమానిపై దాడి
BDK: కొత్తగూడెంలో ఓ ఫ్లెక్సీ షాప్ యజమానిపై కొందరు దాడి చేశారు. పట్టణంలోని MG రోడ్డులోని ఆదిత్య ఫ్లెక్స్ ప్రింటింగ్ యజమాని మల్లికార్జున్‌పై ముగ్గరు తమ పార్టీకి సంబంధించిన బ్యానర్‌ని తొలగించి కాంగ్రెస్ బ్యానర్లను ఎలా కడతావంటూ గొడవకు దిగారు. ఈ క్రమంలో అతనిపై పిడి గుద్దులు గుద్దుతూ, కాళ్లతో ముఖంపై తంతూ దాడి చేశారు. ఈ ఘటనపై బాధితుడు పోలీసలకు ఫిర్యాదు చేశాడు.