గ్యాస్ సిలిండర్ పేరిట కొత్త మోసం: ఎస్పీ

గ్యాస్ సిలిండర్ పేరిట కొత్త మోసం: ఎస్పీ

NGKL: LPG గ్యాస్ బుకింగ్, డెలివరీ పేరుతో వచ్చే నకిలీ వాట్సాప్, SMS లింక్‌లను క్లిక్ చేయవద్దని నాగర్‌కర్నూల్ జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ పాటిల్ ప్రజలను హెచ్చరించారు. సైబర్ నేరగాళ్లు బ్యాంక్ వివరాలు, OTPలు అడిగి నగదు కాజేస్తున్నారని, అనుమానాస్పద లింక్‌లకు దూరంగా ఉండాలని సూచించారు. మోసపోతే వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు.