నేటి నుంచి కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు
WNP: గోపాల్ పేట మండల కేంద్రంలోని శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ నెల 30వ తేదీ వరకు ఉత్సవాలు కొనసాగుతాయని ఆలయ అర్చకులు రంగాచార్యులు తెలిపారు. శ్రీరామనవమి వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు కోరారు.