సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే
SRD: మనూరు మండలంలోని పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే సంజీవరెడ్డి నేడు అందజేశారు. తుమ్ములూరు గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డికి రూ.60 వేలు, బేకరి విట్టమ్మకు రూ.6500 సీఎం సహాయ నిధి ద్వారా చెక్కులు మంజూరు కాగా లబ్ధిదారులకు అందించినట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకుడు బ్రహ్మానందరెడ్డి, తదితరులు ఉన్నారు.