'పేదల సొంతింటి కల కాంగ్రెస్‌తోనే సాధ్యం'

KMM: ప్రభుత్వం అర్హులకే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తుందని కాంగ్రెస్ పట్టణ నాయకుడు సయ్యద్ అన్వర్ అన్నారు. గురువారం ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఆదేశానుసారం వైరా మండలం 13వ వార్డు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇంటి పట్టాలను ఆయన అందజేశారు. పేదల సొంతింటి కల కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నేతలు పాల్గొన్నారు.