VIDEO: నూర్‌కు ఇస్లామిక్ గ్రూపులతో సంబంధాలు: డీఎస్పీ

సత్యసాయి: నూర్‌కు ఇస్లామిక్ గ్రూపులతో సంబంధాలు ఉన్నట్లు పెనుకొండ డీఎస్పీ నర్సింగప్ప తెలిపారు. శనివారం ధర్మవరంలో డీఎస్పీ మాట్లాడుతూ..పాకిస్తాన్ వాట్సాప్ గ్రూపుల్లో నూర్ సభ్యుడిగా ఉన్నాడని సమాచారం అందిందన్నారు. ఉగ్రవాదులతో సంబంధం ఉన్న నూర్‌ను అరెస్ట్ చేశామని, నూర్ ఏయే ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.