అప్పన్నను దర్శించుకున్న ఐఏఎస్ అధికారి
VSP: మణిపూర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి హరేంద్రకుమార్ శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని శుక్రవారం దర్శించుకున్నారు. కప్పస్తంభాన్ని ఆలింగనం చేసి బేడా ప్రదక్షిణ చేశారు. వేదపండితులు అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాన్ని సూపరింటెండెంట్ సత్య శ్రీనివాస్ అందజేశారు.