VIDEO: కుక్కను చంపిన చిరుత
అన్నమయ్య: కురబలకోట మండలం ఎగువ చెన్నామర్రి అటవీ ప్రాంతంలో రైతు నారాయణరెడ్డి పెంపుడు కుక్కను చిరుత చంపినట్లు తెలిపారు. ఆదివారం రాత్రి కుక్కను పొలంలో కాపలా ఉంచిన రైతు, సోమవారం పొలం వద్ద రక్తపు మడుగులో ఉన్న కుక్క మృతదేహాన్ని, చిరుత పాదముద్రలను గుర్తించి అటవీశాఖకు సమాచారం అందించారు. గత నెలలో మరో రైతు పెంపుడు కుక్కను చిరుత చంపిన ఘటన మరువక ముందే ఈ ఘటన చోటు చేసుకుంది.