VIDEO: ‘మా బిడ్డను కొట్టి చంపిన వారిని అరెస్ట్ చేయాలి’
GNTR: కొత్తపేటలోని శ్రీ కాసు సాయమా హై స్కూల్‌లో 10వ తరగతి విద్యార్థుల మధ్య రెండు నెలల క్రితం ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో భరత్ కుమార్ అనే విద్యార్థికి తీవ్ర గాయాలవ్వడంతో తల్లిదండ్రులు గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికత్స పొందుతూ భరత్ కుమార్ గురువారం మరణించాడు. తమ బిడ్డను కొట్టి చంపిన వారిని అరెస్ట్ చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.