'రీ-సర్వే పగడ్బందిగా పూర్తి చేయాలి'
PPM: జిల్లాలో భూముల రీసర్వే పనులు పగడ్బందిగా, సమగ్రంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్లో 2వ విడత రీ సర్వే కార్యక్రమంలో గ్రామ సర్వేర్లు, విఆర్ఓ, విఆర్ఏలతో జాయింట్ కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న జిరాయితీ భూమిగా మార్చే అవకాశం లేదు అన్నారు.