VIDEO: శ్రీ ఇందుకూరు అమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు
NLR: ఇందుకూరుపేట మండల కేంద్రంలోని శ్రీ ఇందుకూరుఅమ్మ, శ్రీ దేశమ్మ దేవతల పునర్నిర్మాణ వేడుకలు ముగిసి 48 రోజులు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో మండల పూజా కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి అర్చకులు ఆలయంలో శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు జరిపారు. గ్రామ దేవతల దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.