ఏలూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో అల్లూరి వర్ధంతి

ELR: అల్లూరి సీతారామరాజు 101వ వర్థంతి సందర్భంగా ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడారు. అల్లూరి త్యాగాలు, వీరత్వం ప్రతి ఒక్క పోలీస్ సిబ్బందికి ఆదర్శంగా నిలవాలన్నారు. ఆయన స్వాతంత్ర పోరాటం, ప్రజల పట్ల ఉన్న ప్రేమ, స్ఫూర్తి మనం కూడా ఉద్యోగంలో చూపించాలన్నారు.