లోక్ అదాలత్‌లో 2,305 కేసులు రాజీ

SKLM: జిల్లా కోర్టు కార్యాలయంలో శనివారం ఉదయం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జూనైద్ అహ్మద్ మౌలానా అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా మొత్తం 2,305 కేసులు రాజీ అయినట్లు చెప్పారు. సివిల్ కేసులు 104, క్రిమినల్ కేసులు 2174, ఫ్రీ లిటిగేషన్ కేసులు 27 రాజీ అయ్యాయన్నారు.