ఇలా చేస్తే మానవ మనుగడ ప్రశ్నార్థకమే?

ఇలా చేస్తే మానవ మనుగడ ప్రశ్నార్థకమే?

RR: షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ మండలం నర్సప్పగూడ నుంచి చేగూరు వెళ్లే దారిలో కరెంటు తీగలకు అడ్డు వస్తున్నాయని ఓ రైతు చెట్లను కొట్టి వేయించాడు. రహదారిపై చెట్టు నరికి వేయడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నామని వాహనదారులు ఆరోపించారు. ప్రాణవాయువునిచ్చే చెట్లను నరికితే భవిష్యత్తులో మానవ మనుగడ ప్రశ్నార్థకమే అని పలువురు వాపోతున్నారు.