ఢిల్లీలో కాలుష్యం.. ఆరుబయట ఆటలు రద్దు
ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకరంగా పెరగడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. తక్షణమే పాఠశాలల్లోని ఆరుబయట ఆటలు, ఇతర అవుట్‌డోర్ కార్యకలాపాలను రద్దు చేసింది. ఈ కాలుష్య మార్గదర్శకాలు కేవలం పాఠశాలలకే కాక, ఢిల్లీ-NCRలోని అన్ని విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, స్పోర్ట్స్ అసోసియేషన్లకు కూడా వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.