VIDEO: విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్

SRPT: మెనూ ప్రకారం నాణ్యత, ప్రమాణాలను పాటిస్తూ విద్యార్థులకు పౌష్టిక ఆహరం అందించాలని సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. శనివారం సూర్యాపేట పట్టణంలో మహాత్మా జ్యోతి బాపూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్సీయల్ పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి ఎలా చదువుతున్నారు? అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలసి భోజనం చేశారు.