ఫర్టిలైజర్స్ షాప్‌లను తనిఖీ చేసిన కలెక్టర్

ఫర్టిలైజర్స్ షాప్‌లను తనిఖీ చేసిన కలెక్టర్

JN: వ్యవసాయ శాఖ అధికారి అంబికా సోనీతో కలిసి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పాలకుర్తి మండల కేంద్రంలో గురువారం పలు ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎరువుల పట్టికలను, రిజిస్టర్లను పరిశీలించారు. యూరియా అమ్మకాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని షాపు నిర్వాహకులకు సూచించారు.