శ్రీకాళహస్తిలో మహిళా సాధికారత కోసం సైకిల్ యాత్ర ప్రారంభం
TPT: శ్రీకాళహస్తిలో ఆదివారం మహిళా సాధికారతను ప్రోత్సహించేందుకు ఒక ప్రత్యేక సైకిల్ యాత్రను ప్రారంభించారు. శ్రీకాళహస్తి నుంచి హైదరాబాద్ వరకు సాగే ఈ యాత్రలో మిస్ ఆంధ్ర చందన జయరాం పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్ ఈ యాత్రకు జెండా ఊపి ప్రారంభించారు. గ్రామీణ మహిళలకు స్ఫూర్తినివ్వడం, వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచడం ప్రధాన లక్ష్యమన్నారు.