కంభంలో అంబటి రాంబాబుపై పోలీసులకు ఫిర్యాదు

కంభంలో అంబటి రాంబాబుపై పోలీసులకు ఫిర్యాదు

ప్రకాశం: కంభం మండల టీడీపీ అధ్యక్షుడు తోట శ్రీను సోమవారం మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎంపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు చర్యలు తీసుకోవాలని ఎస్సై శివ కృష్ణారెడ్డికు కంప్లైంట్ ఇచ్చారు. సీఎం కుటుంబ సభ్యులను బూతులు తిడుతూ బెదిరించిన అంబటిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నేతలు పాల్గొన్నారు.