జన్నారం ఎస్సై గొల్లపల్లి అనూష బదిలీ

జన్నారం ఎస్సై గొల్లపల్లి అనూష బదిలీ

MNCL: జన్నారం మండల ఎస్సై గొల్లపల్లి అనూషను బదిలీ చేస్తూ రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ ఝ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సై అనూషను రామగుండం కమిషనరేట్‌లో విఆర్‌కు పంపుతూ సీపీ ఆదేశాలు ఇచ్చారు. ఎస్సై బదిలీ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని ఒక ప్రకటనలో వెల్లడించారు. జన్నారం మండలానికి కొత్తగా ఎస్సై ఎవరు వస్తారేమోనని అంతటా ఆసక్తి నెలకొంది.