డ్రంక్ అండ్ డ్రైవ్.. రూ.5.66 కోట్ల జరిమాన

HYD: నగర వ్యాప్తంగా పోలీస్ అధికారులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను వేగవంతం చేశారు. కొద్దిరోజులుగా పగలు, రాత్రి తేడా లేకుండా అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. గత ఆరు నెలల కాలంలో ఏకంగా రూ.5.66 కోట్ల వరకు జరిమానాలు విధించినట్లు తెలిపారు. అంతేకాక 150 మందికి పైగా డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ జరిగిందని, ఒకరి లైసెన్స్ జీవితకాలం రద్దు చేసినట్లు పేర్కొన్నారు.