పోలీస్ కాంప్లెక్స్ భవనం అద్దెకు.. దరఖాస్తుల ఆహ్వానం

పోలీస్ కాంప్లెక్స్ భవనం అద్దెకు.. దరఖాస్తుల ఆహ్వానం

ATP: అనంతపురం పోలీస్ కాంప్లెక్స్ ఆవరణలోని పాత భవనం (పాత పీసీఆర్) అద్దెకు ఇవ్వనున్నట్లు జిల్లా ఎస్పీ పి. జగదీష్ తెలిపారు. 70x120 అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ భవనాన్ని అద్దెకు తీసుకోవాలనుకునే వారు ఈ నెల 27వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసక్తిగల వారు తమ వివరాలను జిల్లా పోలీస్ కార్యాలయంలోని అదనపు ఎస్పీ (ఏఆర్) ఆఫీస్‌కు పంపాలని కోరారు.