ఫోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
VZM: జిల్లా మహిళా పోలీస్ స్టేషన్లో 2025లో నమోదైన ఫోక్సో కేసులో గాజులరేగకు చెందిన బొండపల్లి సత్యరావు (59)కి న్యాయమూర్తి నాగమణి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.5 వేలు జరిమానా విధించినట్లు ఎస్పీ ఏ ఆర్ దామోదర్ సోమవారం తెలిపారు. నిందితుడు గాజులరేగకు చెందిన మైనర్ బాలికపై బలత్కారం చేసిన కేసులో నేరారోపణ రుజువు అవడంతో తీర్పు వెలువడినట్లు పేర్కొన్నారు.