శ్రీరామనవమి ఏర్పాట్లపై ఎస్పీ కీలక సూచనలు
SRD: శ్రీరామనవమి వేడుకల ఏర్పాట్లపై సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్ అధికారులకు కీలక సూచనలు చేశారు. పాత బస్టాండ్ రామాలయాన్ని సందర్శించిన ఆయన, భక్తులకు ఇబ్బంది కలగకుండా తాగునీరు, పార్కింగ్, క్యూలైన్ల నిర్వహణ పక్కాగా ఉండాలని ఆదేశించారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలన్నారు. ఉత్సవాలు శాంతియుతంగా జరిగేలా భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.