కాంగ్రెస్‌ని ఓడిస్తే బోనస్ డబ్బులు వస్తాయి: హరీష్ రావు
TG: మొక్కజొన్న రైతులకు బకాయిలు ఇవ్వాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. 2 రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తామని మంత్రి ఉత్తమ్ అన్నారని గుర్తు చేశారు. 50 రోజులైనా రైతులకు మొక్కజొన్న డబ్బులు రాలేదని తెలిపారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను చిత్తుగా ఓడించండి అని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ను ఓడిస్తేనే బోనస్ డబ్బులు పడతాయని పేర్కొన్నారు.