నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
MBNR: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు మంగళవారం కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి జిల్లాలోని నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో వానలు పడవచ్చని పేర్కొంది. ఇప్పటికే చెరువులు, కుంటలు నిండి అలుగు పారాయి. ఆయా జిల్లాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.