మొక్కలను పరిరక్షించాలి: కమిషనర్

మొక్కలను పరిరక్షించాలి: కమిషనర్

గుంటూరు నగరంలో విస్తృతంగా నాటుతున్న మొక్కలను పరిరక్షించడంలో పార్క్ సిబ్బంది, కార్మికులు భాధ్యతగా ఉండాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. గురువారం పట్టాభిపురం, బ్రాడీపేట, నెహ్రూ నగర్, కొత్తపేట తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్య, అభివృద్ధి పనులను పరిశీలించారు. నగరంలో మిషన్ గ్రీన్ గుంటూరులో భాగంగా పర్యావరణ పరిరక్షణ చేయాలన్నారు.