అక్రమ నిర్మాణాన్ని సీజ్ చేసిన అధికారులు
RR: మన్సురాబాద్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీలో అక్రమ నిర్మాణాన్ని జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. డివిజన్‌లోని ప్రజలు ఎమ్మెల్యేతో పాటు అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేయడంతో ఇవాళ చర్యలు తీసుకున్నారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ.. అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.